calender_icon.png 3 April, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం

26-03-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మార్చి 25 (విజయక్రాంతి) : లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, చేయించుకోవడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమ ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారం రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్ట ర్ హరీష్ రాజ్ లతో కలిసి పి.సి.పి.ఎన్.డి.టి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ లింగ ఎంపిక నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని, పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంద న్నారు. జిల్లాలో 52 స్కానింగ్ సెంటర్లు పని చేస్తున్నాయని, ఇందులో 4 ప్రభుత్వ ఆసుపత్రులలో, 48 ప్రైవేట్ వైద్యుల ద్వారా సెంట ర్లు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.

జిల్లాలో ‘బ్రూణ హత్యలు ఆపేద్దాం.. ఆడపిల్లలను రక్షించుకుందాం...‘ అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని, ఒక్క ఆడపిల్లను కోల్పోతే ఒక స్నేహితురాలు, ఒక సోదరి, ఒక బామ్మ, ఒక ఇల్లాలు, ఒక తల్లిని కోల్పోతామని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలలో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరుపాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి స్కానింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉండాలని, వైద్యుల వివరాలు, అందిస్తున్న సేవల సంబంధిత ధరల పట్టిక ప్రదర్శించాలని, స్కానింగ్ మిషన్ వద్ద ఎలాంటి పోస్టర్లు ఉంచకూడదని, స్కానింగ్ సెంటర్ విశాలంగా ఉండాలని తెలిపారు. కొత్తగా 5 స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన ప్రతిపాదనలలో అన్ని సౌకర్యాలు కలిగిన స్కానింగ్ సెంటర్లకు అను మతులు జారీ చేయాలని తెలిపారు.

అనంతరం కార్యక్రమ సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రా మ్ అధికారి డాక్టర్ ఎ.ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, మాస్ మీడియా అధికారి బుక్క వెం కటేశ్వర్లు, ఎస్.ఓ. కాంతారావు, ఎన్.జి.ఓ.లు డాక్టర్ రాధిక, ఐ.ఎం.ఎ. అధ్యక్షులు డాక్టర్ రమణ, సి.ఐ. ప్రమోద్ రావు, సంబందిత శాఖ అధికారులు పాల్గొన్నారు.