calender_icon.png 20 March, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం

20-03-2025 12:45:15 AM

కాటారం (భూపాలపల్లి), మార్చి 19 (విజయక్రాంతి): లింగ నిర్ధారణ పరీక్ష చట్ట రీత్యా నేరమని పరీక్ష చేయించిన వారు, చేసి న వారు, ప్రోత్సహించిన వారు, శిక్షార్హులు అవుతారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ప్ర స్తుతం 14 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ఇం దులో ఐదు ప్రభుత్వాధీనంలో, 9 ప్రైవేట్ సెంటర్ లలో పనిచేస్తున్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై దృష్టి పెట్టాలన్నారు.

పరీక్షలు చేయకూడదని, లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు అలా లింగ నిర్ధారణ చేసినా, చేయిం చినా, ప్రోత్సహించిన వారికి మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూపాయలు 50 వేల జరిమా నా విధిస్తారని పేర్కొన్నారు.  ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 9440586982 మొ బైల్ నంబరుకు సమాచారం అందించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో  ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కవిత గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కూరపాటి రాజేష్, పీడియాట్రిషన్. డాక్టర్ సురేందర్ , సోషల్ వర్కర్లు, డెమో శ్రీదేవి మొదలగు వారు పాల్గొన్నారు.