calender_icon.png 15 October, 2024 | 4:56 AM

ప్రమోషన్లపై జెన్‌కో ఇంజినీర్ల హర్షం

15-10-2024 02:55:47 AM

డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జెన్‌కో ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వడంపై తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రత్నాకర్ రావు, సదానందం హర్షం వ్యక్తం చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా ప్రమోషన్లకు సహకరించిన ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రోస్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు డిప్యూటీ సీఎం భట్టి మోక్షం కల్పించారని వారు అన్నారు. భట్టిని కలిసిన వారిలో అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటనారాయణ రెడ్డి, కిషోర్, సురేశ్ కుమార్, పీవీ రావు, అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వేణు, అనిల్ కుమార్, సుజిత్, రాజు, రాజేశ్, రెమెడీ శ్రీనివాస్, నాగరాజ్ వున్నారు.