calender_icon.png 13 January, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్ జెడ్‌లు అంతా యూట్యూబర్లే..

10-07-2024 12:05:00 AM

  • 65 శాతం మంది కంటెంట్ క్రియేటర్లే 
  • వెల్లడించిన లేటెస్ట్ రిపోర్ట్ 
  • పోయిన సంవత్సరంతో పోలిస్తే 8 శాతం ఎక్కువ

న్యూఢిల్లీ, జూలై 9: జెన్ జెడ్‌లో 65 శాతం మంది వీడియో కంటెంట్ క్రియేటర్లే అని యూట్యూబ్ నివేదిక తెలిపింది. ప్రతి సంవత్సరం లాగానే వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ “కల్చర్ అండ్ ట్రెండ్స్‌” రిపోర్ట్ పేర రిపోర్ట్‌ను విడుదల చేసింది. వివిధ వ యసులకు చెందిన యూజర్ల అభిరుచులను రిపోర్ట్ వెల్లడిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. పోయిన సంవత్సరం జెన్ జెడ్‌కు చెందిన 57 శాతం మంది మాత్రమే కంటెంట్ క్రియేటర్లుగా ఉండగా.. ఈ ఏడాది అది 65 శాతానికి చేరుకుంది. ఈ ట్రెండ్ వీడియో క్రియేటింగ్ అం టే యువత ఎంతలా ఇష్టపడుతుందో తెలియజేస్తుంది. వీడియోస్ క్రియేట్ చేయడమే కాదు.. వాటిని చూసేందుకు కూ డా యువతరం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు దీన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. 

అందుకే పెరుగుతున్నరు

ఒకప్పుడు వీడియో అంటే కేవలం మనం చూసి వదిలేసే వాళ్లం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వీడియోలలో కూడా కృతిమమేధ సాయంతో అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఒక పాప్ మ్యూజిక్ వీడియో వస్తే ఆ వీడియోకు మన ఫేస్, వాయిస్ పెట్టుకునే అనేక ఆప్షన్స్ వచ్చాయి. అది మాత్రమే కాకుండా వీడి యో క్రియేట్ చేయడం అనేది నేటి రోజుల్లో చాలా  సులభం అయిపోయింది. అనేక రకాల టూల్స్ క్రియేటర్ల కోసం అందుబాటులోకి వచ్చాయి.