మంథని(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బోయినపేట పరిసరాల్లో ఆదివారం ఈత చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం గంగాపూర్ కి చెందిన తాటి శంకర్ గౌడ్ (55) ఈత కల్లు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ దవాఖానాకు తరలించారు.