31-03-2025 12:25:46 PM
ఇబ్రహీంపట్నం, (విజయ క్రాంతి): తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్ స్టేషన్(Manchal Police Station) పరిధిలో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన పాశం బుచ్చయ్య గౌడ్ (65) రోజు మాదిరిగా కల్లు తీసేందుకు సోమవారం ఉదయం తాటిచెట్టు పైకి ఎక్కి, ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుతున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.