ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు...
కామారెడ్డి (విజయక్రాంతి): అర్హులైన గౌడ కులస్తులందరికి గీతా కార్మిక లైసెన్సులు అందిస్తామని ఎక్సైజ్ సూపరిడెంట్ హనుమంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. గౌడ కులస్తులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌడ సమస్యల పరిష్కారానికై జై గౌడ ఉద్యమం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్‌గౌడ్, ఇందూరి సిద్దాగౌడ్, తలమడ్ల మురళిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.