నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ స్కూల్లో బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు 200 శ్లోకాలను చదివించి గీతా సారాంశం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మంచిర్యాల నాగభూషణం, ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, నిరువాకుల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.