పటాన్‌చెరు, జనవరి 2: భారత ప్రభుత్వంలోని కేపాసిటీ బిల్డింగ్ కమిషన్(సీబీసీ)తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కౌటిల్లా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ(కేఎస్ పీపీ) గురువారం న్యూడిల్లీలోని సీబీసీ కార్యాలయం లో అవగాహన ఒప్పందం కుర్చుకుందని గీతం యూనివర్సిటీ యాజమాన్యం గురువారం తెలిపింది.
ఈ అవగాహన ఒప్పందాలపై కేఎస్ పీపీ తరపున డీన్, పూర్వ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, డాక్టర్ షరీక్ హసన్.. సీబీసీ తరపున మానవ వనరుల విభాగం సభ్యుడు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి ఎస్‌పీ రాయ్ సంతకాలు చేసినట్లు పేర్కొంది.
భారత ప్రభుత్వం దాని మానవ వనరుల అభ్యాసాలు, సామార్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా భారతదేశం దాని అమలు సామార్థ్యాన్ని సమూలంగా పెంచేందుకు ఈ ఒప్పం దాలు పనిచేస్తాయని తెలిపింది. పబ్లిక్ పాలసీ ఎడ్యుకేషన్‌లో కేఎస్ పీపీ నైపుణ్యాన్ని, సామర్థ్య నిర్మాణానికి బలమైన విధానాలు రూపొందించి సీబీసీ మిషన్ ద్వారా స్థిరమైన ఫలితాలను సాధిస్తామని పేర్కొన్నారు.