calender_icon.png 4 February, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన కాంక్లేవ్ అవార్డు అందుకున్న గీతా వాహిని సంస్థ

04-02-2025 12:27:07 AM

వికారాబాద్ :  ఫిబ్రవరి 3: క్షేత్ర స్థాయిలో భగవత్గీతను ప్రజలలో తీసుకు వెళ్లినందుకు రిప్లెక్షన్ ఛానెల్ సనాతన కాంక్లేవ్ 2.0-25 అవార్డును వికారాబాద్ కు చెందిన గీతా వాహిని సంస్థ కు అందజేశారు. ఆదివారం హైదరాబాద్, నారాయణ గూడలోని కేశవ మెమోరియల్ స్కూల్లోని సనాతన కాంక్లేవ్ అవార్డులను అందజేశారు. సనాతన కాంక్లేవ్ అవార్డు ను గీతా వాహిని సంస్థ అధ్యక్షురాలు శ్రీదేవికి ప్రముఖ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా అందజేశారు.

అధ్యక్షురాలు శ్రీదేవి తోపాటు  ఉపాధ్యక్షురాలు లావణ్య, ప్రధాన కార్యదర్శి జయశ్రీ, కోశాధికారి వరలక్ష్మి, సభ్యులు మధూరి, ఝాన్సీ రాణి, కరుణ, సరళ, లక్ష్మి కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, 2017 నుంచి గీతా హహిని ఆధ్వర్యంలో ఆనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఉచిత భగవత్గీత శిక్షణ తరగతులను వివిధ కాలనీలల్లో 21 వరకు నిర్వహించా మన్నారు.

ఈ శిక్షణ తరగతులలో 1000 మంది వరకు మహిళలు నేర్చుకున్నారని చెప్పారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు 15 శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. 500 విద్యార్థులు శిక్షణ పొందినట్లు చెప్పారు. గీతా ప్రచారంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాడం మాసంలో పలు దేవాలయాలలో గీతా పారాయణం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఏకాదశి వికారాబాద్ శీవాజీ నగర్ గణేష్ కట్ట పై పారాయణం చేస్తున్నామని తెలిపారు.