calender_icon.png 12 December, 2024 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్త మానవాళికి గీతే ఆదర్శం

11-07-2024 12:26:57 AM

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, జూలై 10(విజయక్రాంతి): సమస్త మానవాళికి భగవద్గీతే ఆదర్శమని, మనిషిలో మంచి ప్రవర్తన, సేవాగుణాలను, మానసిక ధైర్యాన్ని పెంపొందించే అంశాలన్నీ అందులో ఉన్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయ ణ అన్నారు. నిజామాబాద్‌లోని ఉమామహేశ్వర ఆలయంలో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో పణతుల మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో ౮ రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమ ద్భాగవత సప్తాహ ప్రవచనానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా పారాయణంలో పాల్గొనడం ప్రతి హిందు వు అదృష్టంగా భావించాలన్నారు. మనిషి భక్తిభావం పెంపొందించుకోవడంతో ధర్మం వైపు అడుగులు వేస్తారని, సేవాభావం పెం పొందుతుందన్నారు. అయ్యప్ప భక్తబృందం ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం, కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్త బృందం తరపున ఆగమయ్య గురుస్వామి, యంసాని రవి, లాభిశెట్టి శ్రీనివాస్, పార్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.