calender_icon.png 14 March, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు

07-03-2025 12:00:00 AM

6.5 శాతం ఉండే అవకాశం

బ్రిక్‌వర్క్ అంచనా

హైదరాబాద్ (విజయక్రాంతి): 202425 ఆర్థిక సంవత్సరంమూడో తైమాసికంలో  దేశ ఆర్థిక ఉత్పత్తి(జీడీపీ)గణనీయంగా పుంజుకోవడాన్ని చూస్త్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం అవుతుంది. 202425 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదయింది. అంతకు ముందు త్రైమాసికంలో నమోదైన 5.4 శాతంతో పోలిస్తే బాగానే పుంచుకొంది. గ్రామీణ వినియోగం, ప్రభుత్వ వ్యయం పెరగడం దీనికి ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో 202425 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని ప్రభుత్వ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది జనవరిలో తొలి ముందస్తు అంచనా అయిన 6.4 శాతంకన్నా ఇది కాస్త ఎక్కువే ఉండడం విశేషం. అయితే రిజర్వ్ బ్యాంకు అంచనా అయిన 6.8 శాతం వృద్ధి రేటుకన్నా ఇది తక్కువే కావడం గమనార్హం. అయితే ప్రపంచంలోని అభివృద్ధి చెందున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది ఎక్కువే కావడం గమనార్హం. కాగా 202425 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా అయిన 6.5 శాతం లక్ష్యం చేరుకోవడానికి  నాలుగో త్రైమాసికం కీలకం కానుందని ప్రముఖ రిసెర్చ్ సంస్థ బ్రిక్‌వర్క్ పేర్కొంది.