ఎస్బీఐ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ, జనవరి 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.3 శాతమే జీడీపీ వృద్ధిచెందుతుందని బుధవారం ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన రి పోర్ట్‌లో అంచనా వేసింది. ఆర్థికాభివృద్ధి నాలుగేండ్ల కనిష్ఠస్థాయి 6.4 శాతానికి తగ్గుతుందం టూ జాతీయ గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రభుత్వ అంచనాలకంటే వృద్ధి మరికాస్త తగ్గవచ్చని పేర్కొంది. ఎన్‌ఎస్‌వో అంచనాలు సబబైన స్థాయిలోనే ఉన్నాయన్నది. 2024- 25లో వినియోగ డిమాండ్ బలహీనంగా ఉం డటమే జీడీపీ వృద్ధి రేటు తగ్గుదలకు ప్రధాన కారణమని ఎస్బీఐ రీసెర్చ్ వివరించింది.