calender_icon.png 26 December, 2024 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడీపీ వృద్ధి 6.5 శాతం

26-12-2024 12:06:36 AM

ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ప్రస్తుత (2024 వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో (2025 భారత్ జీడీపీ 6.5 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) తాజా రిపోర్ట్‌లో అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రైవేటు వినియోగ వ్యయం, స్థూల స్థిర మూలధన కల్పన తగ్గడంతో మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పరిమితమవుతుందని ఈవై పేర్కొంది. ఈ ఏడాది జూలైూ జీడీపీ వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ఠస్థాయి 5.4 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.

అంతక్రితం ఏప్రిల్‌ తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యింది. క్యూ2లో ప్రైవేటు వినియోగ వ్యయం, స్థిర మూలధన కల్పన రెండూ కలిసి 1.5 శాతం తగ్గినందున, జీడీపీ వృద్ధి పడిపోయిందని ఈవై రిపోర్ట్‌లో వివరించింది. ప్రైవేటు పెట్టుబడులు పెరగకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల వ్యయంలో వృద్ధి కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో 15.4 శాతం తగ్గింద ని, ఈ అక్టోబర్ నెలలో కూడా ఇది మైనస్ 8.4 శాతంగా ఉన్నదని తెలిపింది.

దీనితో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ప్రభు త్వ పెట్టుబడుల వ్యయ వృద్ధి గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోలిస్తే 17.1 శాతం క్షీ ణించిందని ఈవై పేర్కొంది. ఈ తగ్గుదలను పూడ్చాలంటే 2024 మిగిలిన ఐదు నెలల్లో ప్రభుత్వ పెట్టుబడుల వ్యయం 60.5 శాతం పెరగాల్సి ఉంటుందని తెలిపింది. 

ప్రభుత్వ మూలధన వ్యయం పెరగాలి

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నందున, భారత్ చాలావరకూ దేశీయ డిమాండ్, సర్వీసుల ఎగుమతులపై ఆధారపడాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలివున్న కాలంలో మూలధన వ్య యాన్ని పెంచితే 6.5 శాతం  వాస్తవ జీడీపీ వృద్ధి సాధించే అవకాశం ఉంటుందని ఈవై అభిప్రాయం వ్యక్తం చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు, వాటి సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కార్పొరేట్ రంగం కలిసి మధ్యకాలిక పెట్టుబడుల ప్రణాళికను ప్రకటిస్తే జీడీపీ వృద్ధి మెరుగుపడుతుందని పే ర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యు త్, పునరుత్పాదక ఇంధనం తదితర ప్రాధా న్య రంగాల లక్ష్యాలను సవరించి, 2019లో ప్రకటించిన నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్‌ను 2030 వరకూ పొడిగించాలని ఈవై రిపోర్ట్ సూచించింది. అంతేకాకుండా వచ్చే ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ ఏటా జీడీపీలో కనీసం 6 శాతం మౌలిక రంగాల వ్యయానికి కేటాయింపులు చేయాలని కోరింది.