calender_icon.png 1 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో జీడీపీ రెట్టింపు

24-03-2025 12:00:00 AM

ఇది మోదీ సర్కారు ఘనత

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ నాయ కత్వంలో పదేళ్లలో దేశ జీడీపీ రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల క్రితం 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ 2025 నాటికి 105% వృద్ధితో 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని విధంగా మన దేశం అద్భుతమైన ఆర్థిక మైలురాయిని సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నిర్మాణాత్మకమైన నాయకత్వానికి ఇది నిదర్శ నమని ఆదివారం ఎక్స్ వేదికగా కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. చురుకైన ఆర్థిక విధానాలు, సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యాపారం చేయండంలో సౌలభ్యంపై నిరంతరం దృష్టి సారించడం ద్వారా మోదీ ప్రభుత్వం భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేర్చిందన్నారు.  స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వానికి లభించని గౌరవం నేడు మోదీ ప్రభుత్వానికి లభిస్తోందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.