calender_icon.png 28 December, 2024 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వితీయ శ్రేణి నగరాలకు జీసీసీలు!

28-12-2024 01:21:20 AM

  1. ఏర్పాటుకు వరంగల్, కరీంనగర్ నగరాలు అనుకూలం
  2. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ఖర్చూ తక్కువే
  3. వరంగల్ ఎయిర్‌పోర్టుతో కనెక్టివిటీ మరింత సులభతరం
  4. వెల్లడించిన నాస్కామ్ నివేదిక

హైదరాబాద్, డిసెంబర్ 2౭ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కు హైదరాబాద్ గమ్యస్థానంగా నిలుస్తుంది. జీసీసీల స్థాపనకు తెలంగాణలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో అనేక కంపెనీలు ముందుకొచ్చాయి.

దీంతోపాటు ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహకారం, రాయితీలు కూడా జీసీసీల ఏర్పాటుకు దోహదపడుతు న్నాయి. లక్షలాది మందికి ఉపాధిని అందించే ఐటీ కంపెనీలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది. హైదరాబాద్‌తో సమాంతరంగా ద్వితీయ, తృ తీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

ఆ దిశగా జీసీసీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరి స్తున్నది. అయితే రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న గరాలైన వరంగల్, కరీంనగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని నాస్కామ్ నివేదికలో తెలిపింది. 

వరంగల్, కరీంనగర్‌లో...

త్వరలో హైదరాబాద్ తరహాలోనే వరంగల్, కరీంనగర్ జిల్లాలు కూడా జీసీసీల ఏర్పాటుకు గమ్యస్థానంగా నిలువనున్నా యి. దీనికి ప్రధాన కారణం నైపుణ్యం ఉన్న మానవ వనరులు, జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థలతోపాటు హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉండటమే. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా అందుబాటు ధరలో ఉంది.

ఇది కంపెనీల ఏర్పాటుకు ఎంతో కలిసి వచ్చే అంశం. దీంతోపాటు వ్యాపార అనుకూల ప్రభుత్వ పాలసీలు కూడా ప్రపంచ స్థాయి కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారించేందుకు ఊతమిస్తుంది. ఈ క్రమం లోనే ఎల్‌టీఐ మైండ్ ట్రీ, జెన్‌ప్యాక్ట్, సైయెంట్ వంటి ఐటీ కంపె నీలు వరంగల్ నగరంలో ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీల స్థాపనతో ఆశించిన ఫలితం వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

తక్కువ ఖర్చుతోనే నిర్వహణ 

హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో నిర్వహణ ఖర్చు కూడా ఎంతో తక్కువ గా ఉంటుంది. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆయా కం పెనీలు కూడా ఎక్కువ దృష్టి సారించేందుకు ముందుకువస్తాయి. తద్వారా నైపుణ్యమున్న వారికి ఉపాధి కల్పించేందుకు పోటీ పెరుగుతుంది.

విద్యాభ్యాసం కోసం ద్వితీయ శ్రేణి నగరాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విద్యార్థులు సరైన ఉపాధి అవకాశం లభిస్తే తిరిగి  వారి ప్రాంతాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. 

ఎయిర్‌పోర్టుతో సులభమైన కనెక్టివిటీ 

ముంబై నగరానికి సమీపంలో ఉన్న కారణంగా పూణె నగరం కూడా అభివృద్ధి చెందింది. అదే తరహాలో వరం గల్, కరీంనగర్ నగరాలు కూడా హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటం కంపెనీల ఏర్పాటుకు ఎంతో సానుకూల అంశం అవుతుంది. హైదరాబాద్ నుంచి మూడు గంటల లోపే ఈ నగరాలకు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూణే నగరంలా వరంగల్, కరీంనగర్ నగరాలు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు అద్భుత అవకాశాలు న్నాయి.

ఇప్పటి వరకు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ప్రయాణ సౌకర్యం కోసం హైద రాబాద్‌ను ఉపయోగించుకునేవారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్‌లో కూడా ఎయిర్‌పోర్టు మం జూరు చేయడంతో ఇక నుంచి జాతీ య, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా సులభతరం కానున్నాయి. ఈ అంశం జీసీసీల ఏర్పాటుకు మరింత ఊతం ఇస్తుంది.