వ్యాధి లక్షణాలతో షోలాపూర్‌కు చెందిన వ్యక్తి మృతి
పుణె, జనవరి 27: మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్(జీబీఎస్) కలకలం రేపుతోంది. షోలాపూర్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం ఒక రోగి మరణించినట్టు వైద్యులు ప్రాథమిక నివేదిక అందిం చారు. పుణె నగరంలో 101 జీబీఎస్ కేసులు నమోదుకావడం అధికారుల్లో ఆందోళన పెంచింది. జీబీఎస్‌తో మరణించిన బాధితుడు(40) అతిసారంతో బాధపడుతున్నా డని, అతడికి దగ్గు, జలుబు లక్షణాలు కూడా ఉన్నాయని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈనెల 18న బాధితుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.
పరిస్థితి మెరుగుపడడంతో ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చా రు. అయినప్పటికీ అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఆరోగ్యం మరింత క్షీణించింది. మళ్లీ ఐసీయూలో చేర్చి కూడా ఫలితం లేకుండా పోయింది. షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్లు శవ పరీక్ష నిర్వహించి, మరణానికి గిలైన్ బారె సిండ్రో మే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దేశంలో జీబీఎస్ తొలి మరణంగా చెబుతున్నారు. మెదడు, రక్తం, పేగు కణజాలాలతో సహ పలు నమూనాలను విశ్లేషించడానికి ల్యాబ్‌కు తరలించారు.
పుణెలో భయం..భయం
పుణె నగరంలో గత 24 గంటల్లో కేసుల సంఖ్య 28కి పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 101కి చేరుకుంది. సాధారణంగా జీబీఎస్ కేసులు నెలకు రెండుకు మించి ఉండవు. ప్రస్తుత కేసుల సంఖ్య భారీగా ఉండడంతో పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోగనిర్ధారణ అయినవారిలో 16 మంది వెంటిలేటర్ పై ఉన్నారు. 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 19 మంది ఉన్నారు.
గిలైన్ బారె సిండ్రోమ్ ఎలా సోకుతుంది?
డయేరియాకు కారణమయ్యే కాంపిలోబ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా జీబీఎస్‌కు కార ణం కావొచ్చని వైద్యులు అనుమానిస్తున్నా రు. కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకుతుం ది. బ్యాక్టీరియా, వైర ల్ ఇ న్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తు లు జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగనిరోధక వ్య వస్థ పొరపాటున నరాలపై దాడిచేసే అరుదైన పరిస్థితి ఇది.
ఇక్కడే కేసులు ఎందుకు?
మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు నమోదు కావడానికి కారణమేమిటనే విషయంపై అధికారులు నీటి పరీక్షలను ముమ్మరం చేశారు. అత్యధిక కేసులు ఉన్న ప్రాంతాల్లో నీటి పరీక్ష ఫలితాలను వెల్లడించారు. పుణెలోని ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని బావిలో ఇ కోలి బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ బావి వినియోగంలో ఉందో లేదో అధికారులు తేల్చలేదు. ఆదివారం నాటికి ఆరోగ్య శాఖ 25,578 ఇండ్లలో సర్వే చేసింది. మరిన్ని జీబీఎస్ కేసులను గుర్తించడానికి మరియు వ్యాధి వ్యాప్తి మూలాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
జీబీఎస్ లక్షణాలు..
* డయేరియా లక్షణాలు
* పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు
* ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం
* కండరాలు బలహీనంగా మారడం
భయం అక్కర్లేదు..
ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు. బాధితుల్లో 80శాతం మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆరు నెలల్లో స్వతహాగా నడువగలరని, మరికొంత మందికి ఏడాది లేక అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చని చెబుతున్నారు.
అయితే జీబీఎస్ చికిత్స ఖర్చు తో కూడుకున్నది అని తెలుస్తోంది. రోగులకు ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. ఒక్కోదానికి సుమారు రూ.20వేల ఖర్చు అవుతుంది. రోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా జీబీఎస్ చికిత్స అందిస్తామని ఆర్థిక మంత్రి పవార్ వెల్లడించారు.