- సిద్ధిపేటకు చెందిన ఓ మహిళకు నిర్ధారణ
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): కొన్ని రోజులుగా మహా వణికిస్తున్న గులియన్ బారే సిం (జీబీఎస్) కేసు హైదరాబాద్‌లోనూ నమోదైంది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళకు ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స కోసం ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చిన ఆమెకు వ్యాధి ఉందని ఆమెకు నిర్వహించిన టెస్టుల్లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితురాలు అదే దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో తొలి జీబీఎస్ కేసు నమోదవడంతో అధికారులు అప్ర చ్ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు.