22-04-2025 01:31:58 PM
మండల విద్యాధికారి నీరజ
చేగుంట,(విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గంగా రావు పదవి విరమణ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజగారు ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ అనేది వయస్సుకే కానీ మనస్సుకు కాదని, తన ఉద్యోగ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన సంతృప్తితో ఉద్యోగ విరమణ చేయడం ఎంతో అదృష్టమన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు అమరశేఖర్ రెడ్డి, శ్రీనివాస రావు,మాసాయి పేట్ మండల విద్యాధికారి లీలావతి, ప్రధానోపాధ్యాయులు గంగాబాయి, శ్రీ కిషన్, లతాంబర్ రావు, మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు గజగట్ల నాగరాజు, వెంకట్రామ్ రెడ్డి, విట్టల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు జగన్ లాల్, విజయసేన రెడ్డి, కృష్ణమూర్తి, సంధ్యా రాణి, సునీత, వాణి, తదితరులు పాల్గొన్నారు.