calender_icon.png 4 March, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్‌బాబుకు గెజిటెడ్ అధికారుల వినతి

04-03-2025 01:25:43 AM

రంగారెడ్డి,మార్చి 3 (విజయక్రాంత్రి) : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్  కొంగరకాలాన్ లో  విధులు నిర్వహి స్తున్న ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ  24 శాతనికి పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కె. రామారావు, సెక్రటరీ శ్రీనేష్ కుమార్ సోమవారం రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా  కొంగరకలాన్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఉద్యోగులకు తగ్గించిన ఇంటి అద్దె బత్యాన్ని 24% కు పెంచాలని, గత రెండు సంవత్సరాల నుండి కొంగరకాలన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్ధికంగా చాలా నష్టం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం తమ ప్రమేయం లేకుండానే నగరం నడిబొడ్డున లకడికాపూల్ లో ఉన్న కలెక్టరు ఆఫీసు మరియు ఇతర కార్యాలయాలను కొంగరుకలాన్ కు తరలించినట్లు చెప్పారు.

కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో  సుమారుగా 600 ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న  ఉద్యోగులు అనేక వ్యయ ప్రయాశాలకు ఓర్చి నగరం నుండి ఇక్కడికి వఛ్చి పనిచేస్తున్నారని... ఉద్యోగులకు వారికి వచ్ఛే ఇంటి అద్దె  బత్యాన్ని 24% నుండి 11% శాతానికి తగ్గించ్చిందని,

కావున కొంగర కాలాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారికి వచ్ఛే ఇంటి అద్దె బత్యాన్ని 24% శాతానికి  పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబు  దీనికి సానుకూలంగా స్పందించారిని.. ఉద్యోగుల సమస్యలను పరిశీలించి  న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు.