24-03-2025 12:00:00 AM
కొత్తపల్లి, మార్చి 23 (విజయక్రాంతి) : కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ ను తెలంగాణ గెజిట్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో )వారు కలసి డైరీని అందజేసి శాలువా తో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళిచరణ్ మా ట్లాడుతూ ఉద్యోగుల ఇన్కమ్ టాక్స్ పరిది పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ డా అరవింద్ రెడ్డి, సభ్యులు అభినవ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు నాయక్ ,కొండల్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.