22-04-2025 12:10:33 AM
యోగితా రాణాకు ఎమ్మెల్సీ కొమరయ్య విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాం తి): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను అర్హులైన సీనియర్ స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విజ్ఞప్తి చేశా రు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి. నర్సింహారెడ్డిని సోమవారం కలిసి ఆయన వినతిపత్రం సమర్పిం చారు. ఈ వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాల ని కోరారు. ఆయనవెంట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్, ఉషారాణి ఉన్నారు.