మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ
కౌలాలంపూర్: భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపిచంద్ జాలీ మలేషియా ఓపెన్ సూపర్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి జంట 21 21 అన్‌సీడెడ్ ఒర్నిచా (థాయ్‌లాండ్) జోడీపై సునాయాస విజయాన్ని అందుకుంది.
కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన గాయత్రి ద్వయం దూకుడు ప్రదర్శిస్తూ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 14 7 కొరియాకు చెందిన యు జెన్ చేతిలో ఓటమి చవిచూశాడు.
ప్రణయ్ మ్యాచ్‌కు అంతరాయం
పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన హెచ్‌ఎస్ ప్రణయ్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. మంగళవారం కెనడాకు చెందిన బ్రియాన్ యంగ్‌తో భారత స్టార్ తలపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న కోర్టు రూఫ్ టాప్ నుంచి నీరు లీకేజీ కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఈ సమయంలో ప్రణయ్ 21 6 స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు. 25 నిమిషాల పాటు సాఫీగా సాగిన మ్యాచ్ దాదాపు గంటపాటు నిలిచిపోయింది.
ఆ తర్వాత మరోసారి మొదలైనప్పటికీ కాసేపటికే రూఫ్ టాప్ నుంచి నీరు కారడంతో మ్యాచ్‌ను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో నిర్వాహకులపై మండిపడుతూ ప్రణయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. కోర్టు లీకేజీ సమస్య ఏర్పడడంతో అక్కడ జరుగుతున్న మ్యాచ్‌లను కూడా నేటికి వాయిదా వేశారు. కేవలం కోర్టు మాత్రమే మ్యాచ్‌లు సజావుగా జరిగాయి. కాగా నిర్వాహకులు కోర్టుపై ఉన్న తడిని ఆరబెట్టడానికి అక్కడక్కడా టవల్స్ వేయడం వైరల్‌గా మారింది.