calender_icon.png 19 January, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

06-07-2024 12:05:00 AM

కల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ ద్వయం గాయత్రి గోపిచంద్ జాలీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో శుక్రవారం గాయత్రి జోడీ 17 21 21 ఆంథోనిసెన్ టిర్టోసెంటోనో జంటను చిత్తు చేసింది. 48 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన గాయత్రి జోడీ రెండో, మూడో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో ప్రియా న్షు 21 21 ఒబయాషి (జపాన్)ను ఓడించి ముందంజ వేశాడు.