21-02-2025 12:46:31 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కొల్లాపూర్ లోని కృష్ణా నది తీర ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోందని విశ్వసనీయ సమాచార మేరకు రాష్ర్ట ఎక్సుజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులకు గంజాయి వేటకు ఆదేశాలు ఇచ్చారు దీంతో గురువారం ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ ఎక్సుజ్ ఉమ్మడి ప్రత్యేక బలగాలు గంజాయి వేట సాగించాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణానది తీరప్రాంతాలు సమీప గ్రామాలు చెంచుపెంటలోనూ గంజాయి సాగు, గుడుంబా స్థావరాలు, కల్తీ మద్యం వంటి వాటిపై అడుగడుగున జల్లెడ పట్టారు.
పోలీసు జాగిలాలతోనూ పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు ఎక్కడ గంజాయి సాగు ఆనవాళ్లు కనిపించలేదని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మారేడుమాన్ దీన్నే యాపట్ల, చంద్రబండ, జొన్నల బొగడ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 150 కేజీల నల్ల బెల్లం, 20 కేజీల స్పట్టిక సీజ్ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాదు నుండి నాలుగు ఎస్టిఎఫ్ టీములతోపాటు డిటిఎఫ్ మహబూబ్ నగర్, డిటిఎఫ్ నాగర్ కర్నూల్, ఎన్ఫోర్స్మెంట్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ఎస్ హెఓ లతో ఎక్సుజ్ పోలీస్లు దాడుల్లో పాల్గొన్నారు.
ఈ దాడుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డిఎస్పి తిరుపతి యాదవ్, ఎక్సుజ్ సూపర్ ఇండియన్స్ ఎస్టిఎఫ్ టీం లీడర్స్ అంజిరెడ్డి, ప్రదీప్ రావు, నాగర్ కర్నూల్ ఎక్సుజ్ సూపర్డెంట్ గాయత్రి,, కొల్లాపూర్ సిఐ మహేష్, ఎస్సు హృశీ కేశ్, ఏ ఈ ఎస్ సుధాకర్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లాపూర్ సిఐ నాగిరెడ్డి, నాగర్ కర్నూల్ డి టి ఎఫ్ కళ్యాణ్, సిఐ ఆర్వి రాజ్యలక్ష్మితో పాటు 60 మంది సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. .