పల్లెకెలె: టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుతో కలిసి తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొనగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ సాధనను పర్యవేక్షించాడు. ఫిజికల్ ఎక్స్‌ర్‌సైజ్‌ల అనంతరం గంభీర్ ఆటగాళ్లతో విడివిగా మాట్లాడాడు. ఈ సందర్భంగా వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు గంభీర్ సూచనలు ఇస్తూ కనిపించాడు. సహాయక కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కటే కూడా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కాగా.. భారత్, శ్రీలంక మధ్య శనివారం తొలి టీ20 జరగనుంది.