calender_icon.png 9 January, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రెస్సింగ్ రూమ్ లీక్‌లపై స్పందించిన గంభీర్

02-01-2025 11:11:53 AM

డ్రెసింగ్ రూమ్ లో లుకలుకల చర్చపై  భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Team India Head Coach Gautam Gambhir) స్పందించారు. భారత్- ఆస్ట్రేలియా చివరి టెస్టు ముందు గంభీర్ మీడియా సమావేశం నిర్వహించాడు. కోచ్-ఆటగాళ్ల మధ్య చర్చలు డ్రెస్సింగ్ రూమ్ వరకే ఉండాలని గంభీర్ సూచించారు. ఆటతీరు మెరుగుపడాలని కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట నిజమేనన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో అశాంతి నెలకొందనే వార్తలపై గంభీర్( Gautam Gambhir) స్పందించారు. అవన్నీ వార్తలే తప్ప.. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆట తీరు ఒక్కటే డ్రెస్సింగ్ రూమ్ లో ఉండేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మతో టెస్ట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలనే వ్యూహాల గురించి తప్ప ఎలాంటి చర్చలు చేయలేదని గంభీర్ చెప్పాడు. జనవరి 3 నుండి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) చివరి మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది.