కేరళ: వయనాడ్ లో కొండచరియల్ విరిపడుతున్న ఘటనలో దాదాపు 204 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కేరళ సీఎం సహాయ నిధికి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. వయనాడ్ కొండచరియల ఘటనలో మరణాలపై అదానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు నటుడు విక్రమ్ రూ.20 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.