15-03-2025 12:19:25 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో గౌరపూర్ణిమ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు తయా రు చేసిన 56 రకాల వంటకాలను ఛప్పన్‌భోగ్ నైవేద్యముగా స్వామివారికి సమర్పించారు. సాయంత్రం 108 కలశాలతో మహా అభిషేకం నిర్వహించారు. అనంతరం మహా పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ మాట్లాడుతూ.. వేదాల ప్రకారం శ్రీ కృష్ణ భగవానుడు ఈ యుగంలో ‘గౌరాంగ’, శ్రీచైత మ క్రీ.శ. 1486లో పశ్చి బెంగాల్‌లోని మాయాపూర్ లో నవద్వీపంలో ఫాల్గుణ పూర్ణిమ రోజున అవ తరించారన్నారు. నేటి యుగధర్మమైన భ సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించా చెప్పారు.
చైతన్య మ ఆశ్ర ద్వారా, ‘హరేకృష్ణ’ మహామంత్రాన్ని జ ద్వారా ఇహలోక బాధల నుంచి విముక్తి పొందగలమన్నారు. కార్యక్రమంలో భాగంగా హరే కృ యూత్ వింగ్ ద్వారా ఫ్రెండ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ(ఎఫ్‌వోఎల్‌కె), గౌ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ స్పి రిట్యువల్ సర్వీసెస్(జీఐఎఫ్‌టీఎస్), వారు ప్రత్యేక ప్రదర్శనలిచ్చారు.
ఐఐఎన్‌జీ(ఇంటికి నితాయ్ గౌరాంగ) భక్తుల నివా పూజ చేయడం కోసం శ్రీగౌర నతాయ్‌ల విగ్రహాలను అందించడం జరిగిం తదనంతరం ఆధ్యాత్మిక, ధార్మిక, కార్యక్రమాలతో కూడిన వార్షిక నివేదికను ప్రదర్శించారు.