చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి...
మందమర్రి (విజయక్రాంతి): జైపూర్ మండలంలోని వేలల గ్రామంలో మహా శివరాత్రి పండగ సందర్భంగా నిర్వహించనున్న గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలనీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswami) అధికారులను ఆదేశించారు. పేరాల గ్రామంలోనీ మల్లన్న స్వామి ఆలయాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), ఇతర అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈసారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని దీనికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. జాతర సందర్భంగా వీఐపీ వాహనాలను గుట్టపైకి అనుమతించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దైవ దర్శనానికి అందరూ సమానులే దేవుడి దగ్గర ఎవరూ వీఐపీలు కాదని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించి, టెంట్ లు వేసి ఎండ తగులకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.