calender_icon.png 20 January, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గట్టు మైసమ్మ జాతర ఉత్సవాలు

20-01-2025 01:06:12 AM

అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన ప్రముఖులు

ఘట్‌కే సర్, జనవరి 19 (విజయక్రాంతి ): ఘట్ కేసర్ పట్టణానికి దక్షిణ దిక్కున కొండగట్టుపై స్వయంభుగా వెలసీ భక్తులు కోరిన కోరికులు తీర్చే ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధి గాంచిన ఆపద మొక్కుల తల్లి గట్టు మైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.

కులమతా లకతీతంగా గ్రామస్తులంతా జరుపుకునే ఎకైక పండుగ అయిన గట్టు మైసమ్మ జాతర ఉత్సవాలలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి చామకూర భద్రారెడ్డి,

బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, పిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, ఘట్ కేసర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డిలు అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు.

ఈ ప్రాంత ప్రజలు భక్తితో కొలిచే గట్టు మైసమ్మ తల్లికి చాలా మహిమలు ఉన్నాయని, కోరిన కోరికలు తీరుతాయని, గట్టు మైసమ్మ తల్లిని వేడుకుంటే మందులతో నయం కాని రోగాలు నయం అవుతాయని, యువతు లకు వివాహాలు జరుగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. అమ్మవారికి డప్పు వాయిద్యాలు, ఆట పాటలు, శివ సత్తుల పూణకాలు, పోతరాజుల విన్యాసాల మద్య మహిళలు బోనాలను ఎత్తుకుని అమ్మవారి వద్దకు వెళ్లి సమర్పించారు.

జాతర ఉత్సవాల సంద ర్భంగా భక్తులు గుడారాలు ఏర్పాటు చేసు కుని బంధు మిత్రులతో కలిసి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, రమాదేవి మహిపాల్ గౌడ్, బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, బండారి అంజనేయులు, కొమ్మిడి అనురాధ, కడపొల్ల మల్లేష్, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు ముత్యాలు యాదవ్, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, దామోధర్ రెడ్డి, శోభారెడ్డి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

భారీ పోలీసు బందోబస్తు

ఘట్‌కేసర్ గట్టుమైసమ్మ జాతర ఉత్సవాలలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిం చారు.

మల్కాజిగిరి ఏసీపీ ఎస్ చక్రపాణి నేతృత్వంలో ఘట్ కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. పరశురాం, పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ, ఘట్ కేసర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ఉత్సవాలు పశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుకున్న ట్లు ఏసీపీ ఎస్ చక్రపాణి తెలిపారు.