22-02-2025 11:57:33 PM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలి
ప్రలోబాలకు నమ్మి మోసపోకండి
ఉద్యోగులకు, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడే పార్టీ బిజెపి
నాడు కేసిఆర్, నేడు రేవంత్‌రెడ్డి బిజెపి నాయకులపై,కార్యకర్తలపై ఎన్ని కుట్రలు చేసిన తిప్పి కొడుతాం
హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్‌కుమార్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వంపై ఇక యుద్దమేనని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించి బిజెపి అభ్యర్థులను బలపర్చాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై, ప్రజల సమస్యలపై పోరాటం చేసి పోలీసుల దెబ్బలు తిని జైళ్ల పాలు అయిన చరిత్ర బిజెపి నాయకులది, కార్యకర్తలదేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు అందివచ్చిన అవకాశమన్నారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో నమ్మించి ఒక గ్యారెంటీ కూడా నేరవేర్చని చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఉద్యోగుల కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయారని దుయ్యబట్టారు. కేసిఆర్ తనను పదవతరగతి హిందీ పేపర్ లీక్ చేశారని అర్దరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసిన చరిత్ర కేసిఆర్ పోయేకాలం దగ్గర పడిందనిఅప్పుడే జోష్యం చెప్పానని గుర్తు చేశారు.
కేసిఆర్ ఉద్యోగుల రిటైర్డ్‌మెంట్ బెనిపిట్స్ ఇవ్వాల్సి వస్తుందని వయసును పొడగించారని అదే తప్పును ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 61 నుంచి 65 సంవత్సరాల రిటైర్డ్‌మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి నేరవేర్చలేదన్నారు. కేవలం 5 గురు మంత్రులకే వారి బిల్లులును పొందారే తప్ప 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నారాజ్‌లోనే ఉన్నారన్నారు. అభివృద్ది జరగడం లేదని, ఆగమ్య గోచరంగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. ఉద్యోగులకు పీఆర్‌ఎసీ,డీఏ ఏది ఇవ్వలేదన్నారు. మోడీ ఐటిలో 12 లక్షల వరకు పెంచిమేలు చేశారన్నారు. ప్రజల బతుకులు బాగు పర్చేది బిజెపి మాత్రమేనని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ, డిఏలు స్పౌజ్ బదిలీలపై బిజెపి పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తామని సిద్దమవుతున్నామన్నారు. కార్యకర్తల మనోభావలను దెబ్బతియకుండా మనోధైర్యాన్ని కల్పించే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు పట్టాభద్రులు, ఉపాధ్యాయ మేథావులు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.
బిఆర్‌ఎస్ తన అభ్యర్థులను నిలుపుకోలేదన్నారు. పది లక్షలు ఇస్తామని నిలబడాలని కొరిన అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి బిఆర్‌ఎస్‌కు నెలకొందన్నారు. కేసిఆర్ అంటేనే చీ అనే స్థాయి ప్రజల్లోకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రలోబాలకు మోసపోవద్దని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఓటుకు 10 వేలు, ఇతర జిల్లాలో ఓటుకు 7 వేల చొప్పున కాంగ్రెస్ ఆఫర్ పెడుతుందన్నారు.దవాత్‌ల మీద దవాత్‌లు పెడుతూ ప్రలోబాలకు కాంగ్రెస్ గురి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మీ సమస్యల కోసం బిజెపి పోరాటం చేస్తుందన్నారు.మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దన్నారు. అక్కడ, ఇక్కడ బిజెపి బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలన్నారు. బిసి,ఎస్సీ, ఓసీలను మోసపోకండి మేథావులు ఆలోచించి ఓటు వేయాలని కొరారు. తెలంగాణలో మేథావులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ తీర్పు ఇస్తారోనని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. బిజెపి అభ్యర్థులను ఓటమి పాలు చేస్తే దేశంలో తప్పుడు సంకేతాలు పోతాయన్నారు. ఒకొక్క ఓటరు 5 ఓట్లను వేయించాలని కొరారు. కామారెడ్డి జిల్లా ఓటర్లు ఎంతో మేథావులన్నారు.
ఇద్దరు సీఎం అభ్యర్థులను నిలబడి ప్రలోబాలకు గురిచేసిన స్థానిక బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పిన చరిత్ర కామారెడ్డి ప్రజలదన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందని అన్నారు. 50 లక్షల కొట్లు దండుకొవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికే 25 లక్షల కొట్లు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వానికి వచ్చాయని మరో 25 లక్షల కొట్లు కొట్టేసేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చారన్నారు. తపాస్ అండగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్ ఎస్ ఎస్ వి.ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్రబిజెపి నాయకులు, మాజీ ఎంపీ బీబీపాటిల్, మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పైడి ఎల్లారెడ్డి, పైడి రాంరెడ్డి, పెద్దోల్ల గంగారెడ్డి, హైమావతిరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, హైమావతిరెడ్డి, జయశ్రీ, మహేదంర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, విపుల్‌జైన్, ఆకుల భారత్‌కుమార్, రాజ్‌పాటిల్, పట్టభధ్రులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.