calender_icon.png 20 March, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్వర్ణాంధ్ర’కు గేట్స్ ఫౌండేషన్ సహకారం!

20-03-2025 01:27:23 AM

  • ఢిల్లీలో బిల్‌గేట్స్‌తో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు
  • అద్భుత సమావేశం జరిగిందని ట్వీట్

న్యూఢిల్లీ, మార్చి 19: స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దార్శనికతను సాకారం చేసు  వడానికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం దో హదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ‘ఎక్స్’వేదికగా వెల్లడించా రు. బుధవారం ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్య వస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు.

బిల్‌గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని, ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపామని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగంపై చర్చించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్‌గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.