calender_icon.png 20 March, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేట్ ఫలితాలు విడుదల

20-03-2025 01:33:31 AM

  • విడుదల చేసిన ఐఐటీ రూర్కీ

ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం

న్యూఢిల్లీ, మార్చి 19: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. గేట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాలు పొందనున్నారు.

అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన gate2025.iitc.ac.in లేదా goaps.iitr.ac.inలో చెక్ చేసుకోవచ్చు. ఈసారి గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీకి అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1,2, 15, 16వ తేదీల్లో సీబీటీ (కంప్యూటర్ ఆధారిత టెస్టు) మోడ్‌లో రెండు సెషన్లలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 8.26 లక్షల మంది గేట్ పరీక్షకు దరఖాస్తూ చేసుకోగా.. 6.53 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.