calender_icon.png 2 January, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ గోదాములు ఊరి బయట ఉండాలి

30-12-2024 02:16:49 AM

* సీపీఐ నాయకుల డిమాండ్

ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జనావాసాల మధ్య ఉన్న గ్యాస్ కంపెనీల గోదాములను ఊరి బయటకు తరలించాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఖమ్మం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలో రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అనేక గ్యాస్ కంపెనీలు జనావాసాల మధ్యనే ప్రమాణాలు పాటించ  నిర్వహిస్తున్నా సివిల్ సప్లు అధికారులు స్పందించడంలేదని ఆరోపించారు. వాటిని వెంటనే ఊరి బయటకు తరలించాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత బరువు కంటే తక్కువ బరువు ఉన్న సిలెండర్లను ప్రజలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.

గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై సంబంధిత అధి  స్పందించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై ప్రజాస్వా   ఉద్యమించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు ఆవుల అశోక్, ఝూన్సీ, శ్రీనివాస్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, జక్కుల భరత్, సత్తార్‌మియా, వెంకటేశ్, కొమరయ్య, నరసింహారావు పాల్గొన్నారు.