calender_icon.png 19 April, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

11-04-2025 12:58:17 AM

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంక్షారెడ్డి

 గజ్వేల్, ఏప్రిల్ 10 :  పెంచిన వంట గ్యాస్  ధరలను వెంటనే తగ్గించాలని   యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంక్షారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   గురువారం గజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి  ఆధ్వర్యంలో   ర్యాలీ నిర్వహించి  కూడలిలో   ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం  చేశారు.  కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్  పాల్గొని ప్రసంగించారు.

పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యుడి బ్రతుకు మరింత దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ప్రజలకు మంచి చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, మరి గ్యాస్ ధరలు పెంచడంలో అంతర్యమేమిటని నిలదీశారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు 30 సార్లకు పైగా వాటి ధరలు పెంచగా, పేదల నడ్డి విరచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు.

ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముకాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పేదల జీవితాలను ఆగమ్య గోచరంగా మార్చినట్లు ఆరోపించారు.  పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతూనే ఉంటామని వివరించారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, సందీప్ రెడ్డి, కిష్టాగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొనగారి రాజు, కార్యదర్శి రాముల గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజహర్, సాయి కుమార్, నేతలు సమీర్, రమేష్ గౌడ్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, నేత నాగరాజు, బైరం రమేష్.చెప్పాల శేఖర్, పాల్గొన్నారు.