calender_icon.png 2 November, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలు

02-11-2024 12:27:15 AM

వాణిజ్య సిలిండర్‌పై రూ.౬౨ పెంపు

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఆయిల్ కంపెనీలు వరుసగా నాలుగో నెల వాణిజ్యపరమైన గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 62 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,802 కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో రూ. 1,754.50, కోల్‌కతాలో రూ. 1,964.50, చెన్నైలో రూ.1,911.50లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లభించనుంది. ఆగస్టులో రూ.8.50 పెంచిన ఆయిల్ కంపెనీలు ఆ తర్వాత నెలలో రూ.39 పెంచాయి. గత నెలలో రూ. 48.50 పెంచి, ఈ నెలలో ఏకంగా రూ.62 పెంచేశాయి.