25-03-2025 08:52:52 PM
ఇంట్లో ఆకస్మికంగా మంటలు..
నాగల్ గిద్ద: వంట గ్యాస్ లీకేజీ ఇంట్లో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న వస్తువులు నగదు, వెండి వస్తువులు కాలిపోయాయి. మంగళవారం సాయంత్రం నాగల్ గిద్ద మండలంలోని గోప్యానాయక్ తండా పంచాయతీ పరిధిలో ఉన్న బిక్య నాయక్ తండాలోని జయరాం ఇంట్లో ఆకస్మికంగా వంటగ్యాస్ లీకేజ్ అయి మంటలు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒకేసారి ఇంటిలో మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న వారందరూ బయటకు పరుగులు తీశారు. నారాయణఖేడ్ సంతలో ఈరోజు బర్రెను అమ్మి 50 వేలు తీసుకురాగా మంటల్లో కాలిపోవడం జరిగిందని బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న 30 తులాల వెండి సైతం కాలిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.