calender_icon.png 14 October, 2024 | 9:56 AM

రైల్వేట్రాక్‌పై గ్యాస్ సిలిండర్

14-10-2024 03:57:30 AM

కలకలం రేపుతున్న వరుస ఘటనలు

ఉత్తరాఖండ్, అక్టోబర్ 13: రైలు ప్రమాదాలే లక్ష్యంగా గుర్తుతెలియని దుండగులు రైల్వేట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు తదితర ప్ర మాదకర వస్తువులు వదిలేస్తున్న క్ర మంలో తాజాగా ఆదివారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్ కనిపిండం కలకలం రేపింది.

అయితే ఆ ట్రాక్‌మీదుగా వస్తున్న గూడ్స్ రైలు లోకో పై లెట్ అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సి లిండర్‌ను తొలగించడంతో పెను ప్ర మాదం తప్పింది. ఈ ఘటనపై ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు మాట్లాడుతూ..

ధంధేరా నుంచి దాదాపు కిలోమీర్ దూరంలో ఉన్న లాండౌరా స్టేషన్ దగ్గర ఆదివారం ఉదయం 6:35 గంటల సమయంలో లోకోపైలెట్ నుంచి ట్రాక్‌పై సిలిండర్ ఉందని సమాచారం అందిన వెంటనే పాయింట్‌మెన్‌ను అలెర్ట్ చేసి సిలిండర్‌ను తొలగించాం.

అయితే సిలిండర్ ఖాళీగా ఉందని హిమాన్షు తెలిపారు. ఇకపోతే దేశవ్యాప్తంగా గతకొన్ని నెలలుగా రైలు ప్ర మాదాలకు కుట్రలు జరుగుతున్నా యి. ఇటీవల కాన్పూర్‌లోని రైల్వే ట్రా క్‌పై ఎల్‌పీజీ సిలిడర్ దొరికింది. మరికొన్ని ఘటనల్లో సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు తదితర వస్తువులను రైల్వే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రైల్వే భద్రతపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.