పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఆనంది టైటిల్ రోల్ పోషించనున్నారు. ఇటీవలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకొంది. షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే తమదైన ప్రమోషన్లతో మూవీ టీజ్ ఆకట్టుకుంటోంది.
ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జానపద కళల్లో ప్రత్యేకంగా చెప్పుకునే ‘నల జిలకర మొగ్గ’ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి కృషి కారణంగా 90ల్లో ప్రాచుర్యంలోకి వచ్చిందీ జానపదం. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీత సారథ్యం వహిస్తుండగా, జే ఆదిత్య సినిమాటోగ్రాఫర్‌గా, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.