10-03-2025 01:05:20 AM
కోదాడ, మార్చి 9: తెలంగాణ రాష్ర్ట ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురా లిగా పట్టణానికి చెందిన గరినే ఉమామహేశ్వరి ఏకగ్రీవం గా నియమితులైనట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజకీయంగా, ఆర్యవైశ్య సామాజికపరంగా నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న వైశ్యరత్మ గరినే కోటేశ్వరరావు కోడలైన ఉమామహేశ్వరికి జిల్లా స్థాయి అవకాశం రావడం పట్ల కోదాడ పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఆమె ఎన్నికపై జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి రమేష్, గారినే శ్రీధర్, వంగవీటి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి సతీష్, దివ్వెల రామారావు, మూడు గుంట్ల శ్రీనివాసరావు, తవిడిషెట్టి నాగేశ్వరరావు, ఓుంగంటి పాండు యాద సుధాకర్, వైశ్య యువజన సంఘ నాయకులు యిమ్మడి అనంత చక్రవర్తి, డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర, ఓుంగంటి నిఖిల్ ,బెలిదే భరత్, వంగవీటి శరత్చంద్ర, అవోప కార్యవర్గం, వాసవి క్లబ్స్ బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.