calender_icon.png 3 April, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుడిచిపెట్టుకుపోనున్న గరిమెళ్ళపాడు!

03-04-2025 12:16:15 AM

కనుచూపు మేరా కానరాని ఉద్యానవనం

మూతపడ్డ గిరిజన యువకుల శిక్షణ కేంద్రం

కొత్తగూడెం, ఏప్రిల్ 2(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవాడ హైవే కు అతి సమీపంలో,ఉన్న గరిమెళ్ళపాడు ఉద్యాన బలంగా ఒకప్పుడు ఎంతో అద్భుతమైన వెలుగు వెలిగి, నేడు దుర్భరమైన పరిస్థితిలో కి నెట్టబడింది. . ఐ టి డి ఏ ఉద్యానవనం పేరుతో అభివృద్ధి చేసింది. ఇక వివరాల్లోకి వెళితే గరిమెళ్ళపాడు ముఖద్వారం త్రీ ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో ఉంటుంది.

అక్కడి నుంచి సుమారు ఒకటిన్నర రెండు కిలోమీటర్ల లోపు పంచాయతీ గరిమెళ్ళపాడు చేరుకోవచ్చు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన గరిమెళ్ళ పాడు పంచాయతీలో చాలా గ్రామాలు ఉండేవి, కాలక్రమంగా పంచాయతీలు, మార్పు చేసిన క్రమంలో గరిమెళ్ళపాడు ప్రత్యేకమైనటువంటి పంచాయతీగా ఏర్పడింది.

ఇది 20 00 ఎకరాల పైనే దీని విస్తీర్ణం ఉండేదని స్థానికులు అంటున్నారు. ఎన్నో అద్భుతమైన పండ్ల తోటలు, పూల తోటలు, సుగం ధపు మొక్కలు, ఎంతోఅద్భుతమైన ఉద్యానవనం, మొక్కలతో ప్రకృతి ఒడిలో పచ్చద నం విరబూసినటువంటి పల్లెగా పేరుగాంచింది.

ఈ గరిమెళ్ళపాడ్, ఒకప్పుడు చుట్టుప క్కల ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల పిల్లలు, ఉద్యోగులు, స్థానికులు, ఈ యొక్క ప్రకృతి వనంలో చేరి పిల్లాపాపలతో ఆనందోత్సవాల మధ్య ప్రకృతిని,ఆస్వాదించి సంతోషంగా గడిపి వెళ్లిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేడు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. చుట్టూ ఉన్నటువంటి తోటలను తీసేసి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

గరిమెల్లపాడు లోపలి భాగాన్ని పరిశీలించినట్లయితే, కేవలం కొంతమంది ఉద్యోగులు, సిబ్బందితో మాత్రమే నెట్టుకొస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక్కడ గతంలో చాలా మందికి, కనీసం 500 పైచిలుకు, కూలీలకు ఉపాధి లభించేది, నేడు దిక్కుతోచని పరిస్థితుల్లో పొట్ట చేత పట్టుకుని పల్లెలు దాటి గ్రామాలు గ్రామాలు దాటి పట్టణాలకు పరిగెత్తుతూ జీవనోపాధిని వెతుక్కున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది.

ఎంతోమంది అధికారులు ఇక్కడ ఉద్యోగ రీత్యా ఉండేవారు. ఏ.వో.లు అగ్రికల్చర్ ఆఫీసర్స్, డి వో. లాంటి ఎంతోమంది గొప్ప పదవులు అలంకరించి,ఆ ప్రాంతాన్ని ఎంతో చాకచక్యంగా అభివృద్ధి చేశారు. ప్రతి ఏటా ఈ ప్రాంతం నుండి, పండ్లను,పూల మొక్కలను ఎగుమతి చేసేటువంటి గరిమెళ్ళ పాడు నేడు పూర్తిగా అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.

యువతకు ఉపాధి లేక ఆగమ్య గోచరంగా తయారైంది. లఘు చిత్రాలకు టీవీ సీరియల్ లకు షూటింగ్స్ కోసం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేవారు. నేడు అది పూర్తిగా కనుమరుగైపోయింది. గరిమెళ్ళపాడు యువతకు ఉపాధినిచ్చే జీడి మామిడి తోటలు మొత్తంగా కనుమరుగై, నేడు సింగరేణి ప్రాంతం వారు సోలార్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారు.

ఫలితంగా యువత ఉపాధి కోల్పోయింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రామవరం పట్టణ ప్రాంత ప్రజలకు కావలసినటువంటి,సరైన ఆక్సిజన్, ప్రాణవాయువును అందించే, ఆ గరిమెళ్ళపాడు నేడు,గర్భస్త కోశంతో రోదిస్తూ, ప్రజలకు ఆయురారోగ్యాలను, ఇవ్వలేని దుర్భరమైన స్థితిలో ఉంది.

ఎంతోమంది యువతకు ఇంకా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఈ గరిమెల్లపాడు,నేడు ఈ దుర్భరమైన పరిస్థితిలో ఉందో, ఒక్కసారి దర్శించి ఈ ప్రాంత అభివృద్ధిపై సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఐటిడిఏ పిఓ, జిల్లా కలెక్టర్లు దృష్టి సారించి, గరిమెళ్ళ పాడును, అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యతను తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు వేడుకొంటున్నారు..