calender_icon.png 10 January, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టళ్లలో చెత్త తొలగించాలి

09-07-2024 02:11:58 AM

సిబ్బందికి జేఎన్టీయూహెచ్ అధికారుల ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్ కూకట్ పల్లిలోని హాస్టళ్లు, మెస్‌లను యూనివర్సిటీ అధికారులు సందర్శించారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై విజయక్రాంతి దినప త్రికలో సోమవారం ప్రచురితమైన “సాంకేతిక యూనివర్సిటీలో సమస్యల తిష్ట’ అనే కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం జేఎన్టీయూ రెక్టార్ కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి తదితరులు మెస్‌లను, హాస్టళ్లను పరిశీలించారు. పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. హాస్టళ్లలోని మరుగుదొడ్లు, మూత్రశాలల్లో మెరు గైన వసతుల కల్పనకు కృషి చేస్తామని విద్యార్థులతో చెప్పారు. అధికారులతోపాటు హాస్టళ్ల వార్డెన్లు దుర్గాకుమార్, రమేష్‌చంద్ర, సత్యనారాయణ, పీఆర్వో ప్రసన్నకుమార్ తదితరులు మెస్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.