మాదాపూర్‌లో ఈవీడీఎం డైరెక్టర్ ఏవీ రంగనాథ్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న మ్యాన్‌హోల్స్‌లో నిలిచిన చెత్తను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జీహెచ్ ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏవి రంగనాథ్ తొలిసారి నగరంలో పర్యటించారు. మాదాపూర్‌లోని వాటర్ లాగింగ్ పాయింట్లను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.