calender_icon.png 26 November, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరగాల్సిందే..

15-10-2024 01:39:19 PM

స్వచ్ఛ సిద్దిపేటగా తీర్చిదిద్దుదమని సిబ్బందికి సూచనలు చేస్తున్న కమిషనర్

సిద్దిపేట (విజయక్రాంతి): ఇంటింటి చెత్త సేకరణ చేసే మున్సిపల్ వాహనాల డ్రైవర్ లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అశ్రిత్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో ఇంటింటి చెత్త సేకరణలో ప్రముఖ పాత్ర వహించేది చెత్త వాహనాల డ్రైవర్ లు, సిబ్బందని చెప్పారు. మనం సరైన సమయానికి వార్డులలోకి వెళ్తేనే పట్టణ నివాసితులు చెత్తను వేరు చేసి వాహనానికి ఇస్తారన్నారు. అన్ని వాహనాల ఫిట్నెస్ చెక్ చేపించాలని ఆదేశించారు. వాహనాల ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే మరమ్మత్తులు చేపించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్న సమయంలో ప్రతిరోజు ప్రతి వార్డులో 10 గృహాల నుండి చెత్త సేకరణ చేసినట్లుగా వారి వద్ద నుండి పుస్తకంలో సంతకాలు సేకరించాలన్నారు.

చెత్త సేకరణ అయిన అనంతరం మధ్యాహ్నం సమయంలో పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించాలన్నారు. ప్రతి వార్డులో తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేయు విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్త ఇచ్చేలా చూడాలని, మెప్మా రిసోర్స్ పర్సన్ ఉదయం వార్డులో తిరగాలని ఆదేశించారు. అందరం శ్రమించి సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా తీర్చిదిద్దుదామన్నారు. డిఆర్సీసీలోని కాంపాక్టర్ ని వెంటనే మరమ్మత్తు చేపించలని డిఈని ఆదేశించారు. వాహనాలు ఏ సమయానికి ఏ ప్రాంతంలో ఉన్నాయి, రోజులో ఎన్ని కిలో మీటర్లు తిరిగింది అనే ప్రతి సమాచారం జీపీఎస్ ట్రాకింగ్ విధానం ద్వారా పరిశీలించటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఈ ప్రేరణ, సానిటరీ ఇన్స్పెక్టర్ మాధవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.