calender_icon.png 22 October, 2024 | 5:06 AM

ఇంటింటా చెత్తసేకరణ జరగాలి

22-10-2024 12:26:15 AM

  1. గార్భేజ్ ఫ్రీ సర్కిళ్లుగా మార్చాలి
  2. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో స్వచ్ఛ ఆటోల ద్వారా వందశాతం ఇంటింటా చెత్త సేకరణ జరగాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్ జోన్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కేబీఆర్ పార్క్, శ్రీరాంనగర్ నగర్ బస్తీ, రోడ్ నెంబర్ 35, యూసు ఫ్‌గూడలో  పర్యటించారు.

ఈ సందర్భంగా ఇలంబర్తి మాట్లాడుతూ గార్భేజ్ వాల్నారేబుల్ పాయింట్(జీవీపీ)లను తొలగించి ఆ ప్రాంతాలను గార్భేజ్ ఫ్రీ సర్కిళ్లుగా మార్చాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ వైద్యాధికారి భార్గవ్‌నారాయణ్, ఈఈ తదితరులు ఉన్నారు.

అక్రమ నిర్మాణాల నియంత్రణపై దృష్టి

జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాల నియంత్రణపై దృష్టి సారించాలని కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. సెక్షన్ ఆఫీసర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరును సమీక్షించాలని సీసీపీని ఆదేశించారు. ప్రజావాణికి హెచ్‌వోడీలు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.