calender_icon.png 24 December, 2024 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడలో పడకేసిన పారిశుధ్యం..!

11-09-2024 07:02:34 PM

మున్సిపాలిటీ పక్కనే అధ్వానంగా దర్శనమిస్తున్న చెత్త

చెత్తను ఖాళీ ప్రదేశాల్లో  వేస్తున్న జనం

సిబ్బంది చెప్పినా తీరు మార్చుకొని వైనం

దుర్వాసన వెదజల్లుతున్న వ్యర్ధాల కుప్ప

దాంతో విష జ్వరాల బారిన పడుతున్న ప్రజానీకం

సూర్యాపేట, (విజయక్రాంతి): జిల్లాలోని కోదాడ పట్టణంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ అధ్వానంగా చెత్తలు దర్శనమిస్తున్నాయి. సిబ్బంది చెప్పిన జనం తీరు మార్చుకోకపోవడంతో చెత్త కుప్పలే ప్రజల పాలిట శాపంగా మారింది. కోదాడ పట్టణంలోని ఏ వీధిలో చూసినా చెత్త పేరుక్కుపోయి కుళ్లి పోవడంతో దుర్వాసన వెదజల్లుతు, దోమలు చేరి డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్, వంటి విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం చుట్టూ అధికారులే ఉన్నప్పటికీ పారిశుద్ధ్యం పడకేసింది.

మున్సిపాలిటీ పక్కనే వ్యర్థాల కుప్ప

కోదాడ మున్సిపాలిటీ పక్కనే ఖాళీ స్థలంలో చేత్త వ్యర్థాలతో  దర్శనమిస్తుంది. మున్సిపాలిటీ చుట్టూ అధికారులు తిరుగుతూనే ఉంటారు. మున్సిపాలిటీ కార్మికులు ట్రాక్టర్లను ఆటోలను నిలుపు స్థలంగా ఉంటాయి. కానీ వాళ్లకు దర్శనమిస్తున్న చెత్తకుప్పలు ఏమాత్రం కంటికి కనిపించడం లేదని అక్కడ ఏర్పాటు చేసుకున్న వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నుండి వచ్చే జనాలు ఖాళీ స్థలం లోనే మూత్రం విసర్జన చేయడం అక్కడ విపరీతమైన దుర్వాసన వెదజల్లుతూ, చుట్టుపక్కల ప్రజలు విపరీతమైన దుర్వాసన వస్తుందని దాంతో విష జ్వరాలతో అనారోగ్యాన పడ్డారని తెలిపారు. అలాగే బ్రిలియంట్ స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నీళ్లు నిలువ ఉండి దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు తెలిపారు.