calender_icon.png 28 November, 2024 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముళ్లపొదల్లో చెత్త సేకరణ వాహనాలు!

27-08-2024 01:12:07 AM

సంగారెడ్డి మున్సిపాలిటీలో కనిపించని స్వచ్ఛత

చెత్త సేకరణ వాహనలకు మరమ్మతులు కరువు

సంగారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాం తి): చెత్తను సేకరించేందుకు ప్రభు త్వం రూ. లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలు మర మ్మతులకు నోచుకోక ముళ్లపొ దల్లో దర్శనం ఇస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం సంగారెడ్డి మున్సిపాలిటీలో మరుగునపడుతు న్నది. పట్టణాల్లో చెత్త సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో సంగారెడ్డిలో వస్తువులు, వాహనాలు కొనుగోలు చేశారు. వాటికి మరమ్మతులు చేయకపోవడంతో పాత ఇనుములా తయారయ్యాయి. నిరుపయోగంగా ఉండటంతో సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాత కలెక్టరేట్ ఆవరణలో ముళ్ల పొదల్లో వాహనాలు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనాలకు సంబంధించిన మోటార్లు, విలువైన వస్తువులు చోరీ అవుతున్నాయి. 

మరమ్మతుల పేరుతో నిధులు స్వాహా!

సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డు ల్లో చెత్త సేకరణ కోసం ఉన్న వాహనాల మరమ్మతులకు ఏటా నిధులు ఖర్చు చేస్తారు. చెత్త సేకరణ ఆటోలతోపాటు ట్రాక్ట ర్లు, ఇతర వాహనాల మరమ్మతులకు ప్రభు త్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుం ది. కానీ వాటిని వాహనాల మరమ్మతులకు ఉపయోగించకుండా అధికారులు, సిబ్బంది స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాహనాల డీజీల్ వినియోగంలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.