యాదాద్రి భువనగిరి, జనవరి 16 (విజయ క్రాంతి): గ్రామ పరిశుభ్రతే గ్రామస్థుల ఆరోగ్యమని డాక్టర్ రేఖల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సొంత నిధులతో భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో 700 తడి, పొడి చెత్తబుట్టలను అందజేశారు. వాటిని జిల్లా సీఈవో ఎన్ శోభారాణి, డీఆర్డీవో నాగిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ చేతుల మీదుగా గురువారం నాడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాజ్పూర్ గ్రామ మాజీ సర్పం బొమ్మారపు సురేశ్, ఉప సర్పంచ్ ర్యాఖల సంతోశ్, శ్రీనివాస్, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.