14-04-2025 12:39:44 AM
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ’గావ్ చలో- బస్తీ చలో’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద నుండి తాసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేములవాడ బిజెపి నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం పేరుతో బిజెపి పై కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కుటుంబ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, అంబేద్కర్ వారోత్సవాల జిల్లా కన్వీనర్ ఓరుగంటి చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు నలువాల తిరుపతితో పాటూ బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.